దీన్ని Ampere కంపెనీ తయారుచేసింది. పేరు Magnus EX. దీనికి 60V, 38.25Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దీన్ని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే, 121 km వెళ్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చెయ్యడానికి 5-6 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌తో 100 కిలోమీటర్లు వెళ్లేందుకు అయ్యే ఖర్చు రూ.10.33 మాత్రమే. బ్యాటరీని బయటకు తియ్యవచ్చు.
ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లు. ఇది స్మూత్‌గా వెళ్లేలా 1200W మోటర్ సెట్ చేశారు. ఈ స్కూటర్ స్టైలిష్ లుక్ గా ఉంది. పెద్ద సీటు, కాళ్ల దగ్గర ఎక్కువ స్పేస్ ఇచ్చారు. డిజిటల్ డ్యాష్‌బోర్డుపై స్పీడ్, బ్యాటరీ లెవెల్, ట్రిప్ డీటెయిల్స్ చూడొచ్చు.
ఇంకా ఈ స్కూటర్‌కి కీ-లెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. రివర్స్ అసిస్ట్ మోడ్ ఉంది. అందువల్ల ట్రాఫిక్‌లో వెనక్కి కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. బెటర్ విజిబులిటీ కోసం DRLs ఉన్నాయి. దీనికి సీటు కింద 18 లీటర్ల స్పేస్ ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర రూ.89,999 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే రూ.97,000 దాకా ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయి.
lifestyle
ఎలక్ట్రిక్ స్కూటర్.. 121కిమీ మైలేజ్.. రూ.10కే 100కిమీ వెళ్లొచ్చు!
- November 18, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 3 Views