ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాజకీయంగా జగన్ ను ఫిక్స్ చేయటం కోసం పావులు కడుపుతుంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పదే పదే ఆరోపిస్తున్న కూటమి నేతలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా కసరత్తు చేసారు. అందులో భాగంగా జగన్ హయాంలో జరిగిన భూ లావాదేవీల పైన ఫోకస్ చేసింది. జగన్ అండ్ టీంకు ఉచ్చు బిగిసేలా ఆధారాల సేకరణలో ప్రభుత్వం నిమగ్నమైందని స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాడు విపక్షంలో ఉన్న చేసిన ఆరోపణలు విచారణకు సిద్దమైంది. ఇప్పటికే ఇసుక, లిక్కర్ అంశాల పైన సీఐడీ విచారణ చేస్తోంది. అదే విధంగా సోషల్ మీడియా పోస్టులు, వైసీపీ నేతల పై గతంలో ఉన్న అభియోగాల పైన విచారణ కొనసాగుతోంది. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. లిక్కర్, ఇసుక అక్రమాల పైన సీఐడీ వైసీపీ నేతలు పలువురిని అరెస్ట్ చేసింది. ఇక, ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh
జగన్ అస్త్రంతోనే కూటమి రివర్స్ ఉచ్చు- హిస్టరీ రిపీట్..!!
- November 18, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 5 Views