సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ కు ఉంగరం తొడిగిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్నారు. “ఉర్ఫీ ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటుంది, అందుకే ఇలా చేసింది” అని వారు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల ఉర్ఫీ జావేద్ చడీచప్పుడూ లేకుండా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం కొత్త రియాలిటీ షోలలో పాల్గొంటోంది. “ఎంగేజ్డ్: రోకా యా దోఖా” అనే షో త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ షో ప్రోమో షూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పరిణామం పై నెటిజన్లు వివిధ విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది చీప్ పబ్లిసిటీ స్టంట్ అని అభిప్రాయపడుతుండగా, కొందరు ఉర్ఫీ జావేద్ గతంలో వివాదాల్లో చిక్కుకున్న వ్యక్తిగా ఉన్నందున ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారం చేయడం చాలా సాధారణమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.