ప్రభాస్ తన ‘రుద్ర’ పాత్రలో కొత్తగా దర్శనమిచ్చారు. మెడలో రుద్రాక్ష, కాషాయ దుస్తులు, పొడవైన జుట్టుతో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. “ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది.
ఈ లుక్ విడుదలవడంతో ప్రభాస్ రుద్ర మరియు కన్నప్ప ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏప్రిల్ 25, 2025 న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీ, ప్రభాస్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ తో మాస్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటుంది!