లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార. దక్షిణ భారతదేశంలోని చిత్ర సీమల్లో అత్యధిక పారితోషికాన్ని అందుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు గతంలో తనకున్న ప్రేమ సంబంధాలు కూడా వార్తల్లో నిలిచేవి. నయనతారకు కావాల్సినంత ప్రచారాన్ని తీసుకువచ్చింది. అయితే ఎవరిని ప్రేమించినా అవేవీ పెళ్లిపీటల వరకు వెళ్లలేదు.
చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. తాజాగా నయనతార జీవితానికి సంబంధించిన కథతో డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో తన ప్రేమ, పెళ్లి, కుటుంబం.. ఇలా అన్ని విషయాలను పంచుకుంది. అలాగే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతు సెట్ లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని, ఫోన్ లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని నాగార్జున చెప్పారు. తన రిలేషన్ షిప్ లోనే సమస్య ఉందని అనిపించేదన్నారు.
entertainment
ప్రేమిస్తున్నాడని అనుకున్నా.. నమ్మించి మోసం చేశాడు: నయనతార
- November 19, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 2 Views