news

భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో భాగంగా గాలింపు చేపడుతున్న భద్రతా బలగాలకు శనివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే వారు జవాన్లపై కాల్పులకు ఎగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.మరోవైపు, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపూర్‌లోని అబూజ్‌మడ్ ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. గాయపడిన సైనికులను రాయ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content