ఏపీలో అత్యంత వివాదస్పదంగా మారిన విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రుషికొండ నిర్మాణాలపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రుషికొండను తొలిచి ఈ నిర్మాణాలను వైసీపీ ఎలా చేసింది, ఎంత ఖర్చుపెట్టారు, అందులో విలాసవంతమైన సామాగ్రి, దానిపై భవిష్యత్తులో ఎలా వాడుకోవాలన్న ప్రభుత్వం చర్చిస్తోంది. అప్పటి వరకు రుషికొండ భవనాలపై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు వరుసగా దీన్ని సందర్శించడంప్రరంభించారు ఈ భవనాలను ఏం చేయాలో తెలియడం లేదని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ భవనాలను ఎలా వాడుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ చర్చలో సభ్యులు ఇచ్చే సూచనల ఆధారంగా ప్రభుత్వం రుషికొండపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Andhra Pradesh
రుషికొండను ఎలా వాడుకుందాం? నేడు తేల్చనున్న సర్కార్..!
- November 19, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 2 Views