ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నెత్తి మీద ఉంచుకున్నారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా బీజేపీ అజెండాలోని దాదాపు అన్ని అంశాల్లో ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు. ప్రస్తుతం బీజేపీ అజెండాను అమలు చేయడానికి ఎంపిక బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు పవన్ కనిపిస్తున్నారు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుంది.తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం.. ఇలా ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా బీజేపీ అజెండాలోని ప్రతీ అంశాన్నీ ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం అజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్న వేళ పవన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించాలనే చర్చ జరుగుతుంది.
Andhra Pradesh
రూటు మార్చేసిన పవన్- బీజేపీ బిగ్ ప్లాన్?
- November 19, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 2 Views