news

వామ్మో.. గాలినీ అమ్మేస్తున్నారుగా.. 1 లీటర్ ఎంతో తెలుసా!

మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నామా అంటే.. లేదు అన్నదే సమాధానం. అలాగని మనం గాలిని డబ్బు పెట్టి కొనుక్కోలేం కదా. దొరికిన గాలినే పీల్చుతాం. అలాగే రోజులు గడిపేస్తాం. కానీ ఓ కంపెనీ స్వచ్ఛమైన గాలిని అమ్మడం మొదలుపెట్టింది. ఎవరు కొంటారు అని మనం అనుకోవచ్చు. ఓ 30 ఏళ్ల కిందట వాటర్ బాటిల్స్ లేవు. ఆ తర్వాత నీటి అమ్మకం మొదలైంది. అప్పట్లో నీరు ఎవరు కొంటారు.. అని అనుకుంటే.. ఇప్పుడు అందరూ కొంటున్నారు. అలాగే.. గాలిని కూడా భవిష్యత్తులో అందరూ కొనుక్కుంటారా?కమ్యూనికా అనే కంపెనీ.. ఈ గాలి అమ్మకం మొదలుపెట్టింది. ఇటలీలో లేక్ కోమో (Lake Como) అనే సరస్సు ఉన్న ప్రాంతం చాలా స్వచ్ఛంగా, కాలుష్యం లేకుండా ఉంటుంది. ఆ సరస్సు పక్కన ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలి లభిస్తోందనీ.. దాన్ని క్యాన్స్‌లో బంధించి.. దానికి తమ దగ్గర ఉన్న సీక్రెట్ ఫార్ములా గాలిని కూడా కలిపి అమ్ముతున్నామని.. ఆ కంపెనీ చెప్పుతుంది. ఈ గాలిని మీరు పీల్చాలంటే.. 400ml టిన్ ధర రూ.907గా ఫిక్స్ చేశారు. అంటే లీటర్ గాలి ధర రూ.2,267. అమ్మో అంత రేటా అని మనకు అనిపించవచ్చు. దాని తయారీకి అంత ఖర్చవుతోందని ఆ కంపెనీ చెప్పుతుంది. ఆ గాలిని పీల్చితే.. మనసు తేలిక అవుతుందని చెప్పుతుంది. పీల్చకపోతే అవ్వదా అనే ప్రశ్నలు రావడం సహజం.అసలు ఆ టిన్ నుంచి ఆ గాలిని ఎలా పీల్చుతాం అనే డౌట్ మనకు రావడం ఖాయం. క్యాప్ ఓపెన్ చెయ్యగానే.. గాలి బయటకు పోతుంది కదా. బయటిగాలితో కలిసిపోతుంది కదా. కమ్యూనికా కంపెనీ మాత్రం.. ఈ గాలిని పీల్చిన వారికి.. తమ చిన్నతనం, ఆ నాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంటోంది. ఎందుకంటే.. ఆ గాలి, అప్పటి స్వచ్ఛమైన గాలిని గుర్తుచేస్తుందని చెప్పుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content