13 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు పిల్లలు అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్రికెట్ అకాడమీలకు వెళ్తారు… లేదా అతను పోటీ పరీక్షలకు ముందుగానే సిద్ధం అవుతారు.. కానీ, రంజీ క్రికెట్ ఆడేశాడు.. అండర్ 19 ప్రపంచ కప్ కూడా ఆడేశాడు.. మిగిలింది టీమ్ ఇండియా గడప తొక్కడమే.. ఆ దిశగా మొదటి అడుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వైపు అడుగేశాడు. భారత క్రికెట్ లో సహజంగా ముంబై డామినేషన్ ఉంటుంది. లేదా నార్త్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది.. కానీ, ప్రతిభ ఉంటే ఇవేవీ అడ్డుకోలేవు. దీనికి నిదర్శనమే బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం నుంచి ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు మార్మోగుతున్న వైభవ్ సూర్య వంశీ. 13 ఏళ్ల సూర్య వంశీ భవిష్యత్ క్రికెట్ స్టార్ గా పేరు సాధించాడు. బిహార్ రాష్ట్రం తాజ్‌పూర్ గ్రామానికి చెందినవాడు వైభవ్ సూర్యవంశీ. 2011లో పుట్టిన ఇతడు నాలుగేళ్ల వయసుకే బ్యాట్ పట్టాడు. దీంతో వైభవ్ కు క్రికెట్ అంటే ఆసక్తి లేదని గమనించిన అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఏకంగా సొంత మైదానమే సిద్ధం చేశాడు. 2019 నాటికి.. అంటే 8 ఏళ్లు వచ్చేసరికి సమస్తిపుర్‌లోని క్రికెట్ అకాడమీలో చేర్చాడు. రెండేళ్ల శిక్షణలోనే వైభవ్ బిహార్ అండర్-16 జట్టులోకి ప్రవేశించాడు. అంటే 10 ఏళ్లకే 16 ఏళ్ల వయస్సు ఆడాడు.
sports
13 ఏళ్లకే ఐపీఎల్ … ఎవరీ బిహారీ బాలుడు..?
- November 19, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 2 Views