కోహ్లీని టార్గెట్ చేసిన రోహిత్ : నేను దేశం కోసం ఆడతా

కోహ్లీని టార్గెట్ చేసిన రోహిత్ : నేను దేశం కోసం ఆడతా

0

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘నేను బయటికి వచ్చేసింది కేవలం జట్టు కోసమే కాదు. నా దేశం కోసం బయటికి వచ్చాను’ అని బుధవారం ట్విట్టర్లో పోస్టు చేశాడు. వరల్డ్ కప్ టోర్నీలో కెప్టెన్ కోహ్లీకి.. రోహిత్ శర్మకు మధ్య విభేదాలు వచ్చాయంటూ రూమర్లు వచ్చాయి. వాటిని బలపరచేలా రోహిత్ శర్మ.. కోహ్లీ సోషల్ మీడియా అకౌంట్‌ను అన్ ఫాలో చేసేశాడు.

ఇక వీటిపై వెస్టిండీస్ టూర్‌కు వెళ్లబోయే ముందు విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ‘చాలా కాలం నుంచి చూస్తున్నా. వ్యక్తిగత విషయాలను మీడియా ముందుపెడుతున్నారు. ఇది చాలా అవమానకరమైన విషయం. నాకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విద్వేషాలు లేవు. ఈ రూమర్లను దాటి నిజాన్ని చూపించాలనుకుంటున్నాం. కొన్నిసార్లు మంచి జరగాలంటే గుడ్డిగా ఉండకతప్పదు’ అని కోహ్లీ వివరణ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here