మన్మథుడు 2 మూవీ రివ్యూ..!!

మన్మథుడు 2 మూవీ రివ్యూ..!!

0

నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తీ సురేష్, సమంత, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
కథ సహకారం: కిట్టు వాస్సాప్రగడ
స్క్రీన్ ప్లే సహకారం: సత్యానంద్
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్: ఎం సుకుమార్
ఎడిటర్: నాగేశ్వర్‌రెడ్డి బీ
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18, మనం

నాగార్జున రకుల్ హీరో హీరోయిన్లు గా తెరెకెక్కిన సినిమా మన్మధుడు 2 .హీరో నుంచి డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి కారణం శృతి మించిన రొమాంటిక్ సీన్స్ .ఆ మధ్య రిలీజ్ ఐన ట్రైలర్ లోనాగార్జున లేటు వయసులో ఘాటు రొమాన్స్ చేయడంతో ప్రేక్షకులు కూడా ఒకింత షాక్ కి గురయ్యారు.ట్రైలర్ ఈ రకంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి అంచనాలను “మన్మథుడు 2” టీమ్ ఎంత వరకు అందుకున్నారో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి చూద్దాం రండి.

కథ :
కథలోకి వెళ్లినట్టయితే సామ్(నాగార్జున) తన మొదటి ప్రేమ విఫలం అయ్యిన దగ్గర నుంచి ఒక ప్లే బాయ్ లా మారి అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు.కానీ సమయం మించిపోతుందని అతని కుటుంబీకులు తొందర చేసి పెళ్లి చేసేద్దామనుకుంటారు.కానీ దాన్ని ఎలా అయినా చెడగొట్టాలని అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్)ను తన గర్ల్ ఫ్రెండ్ గా నటించాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు.వీళ్లిద్దరు ఎలా పెళ్లిని చెడగొట్టాలని చూస్తారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఫన్ జెనరేట్ అయ్యింది.మధ్యలో వీరు ఎదుర్కున్న సమస్యలు ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటీనటులు:

తన వయసును అంగీకరిస్తూ చేసిన సామ్‌ పాత్రలో నాగ్‌ సూపర్బ్ అనిపించాడు. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూనే తన ఏజ్‌ను కూడా గుర్తు చేశాడు. తన మార్క్‌ రొమాంటిక్‌ సీన్స్‌లో వావ్ అనిపించిన నాగ్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. ఇప్పటికీ తాను మన్మథుడినే అంటూ ప్రూవ్‌ చేసుకున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇండిపెండెంట్‌ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది. వెన్నెల కిశోర్‌ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్‌ తన మార్క్‌ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు.

సాంకేతిక నిపుణులు:

డైరెక్షన్ పరంగా రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 అని టైటిల్ పెట్టకుండా ఉండి ఉంటే ఆ సినిమా పోల్చకుండా ఉండేవారు, కానీ అలా టైటిల్ పెట్టడం వలన ప్రతీసారి ఆ సినిమా తో పోల్చాల్చి వస్తుంది, అది సినిమాకి మైనస్ అయిందని చెప్పొచ్చు. వేరే టైటిల్ పెట్టి ఉంటే సినిమా డిఫెరెంట్ గా ఉండేది అండ్ మరింత గా ఆకట్టుకుని ఉండేది. సంగీతం విషయానికి వస్తే మన్మథుడు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ తో పోల్చితే 10% కూడా ఇంపాక్ట్ ని చూపలేక పోయాయి పాటలు అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది, ఓవరాల్ గా డైరెక్టర్ గా మొదటి అర్ధభాగం వరకు సక్సెస్ అయినా సెకెండ్ ఆఫ్ విషయంలో అలాగే రొటీన్ క్లైమాక్స్ విషయం లో రాహుల్ సక్సెస్ కాలేదు. ఓవరాల్ గా సినిమా ఒకసారి చూసేలా ఉంది, మన్మథుడు తో పోల్చితే మాత్రం కొంత నిరాశ పరుచుతుంది అని చెప్పొచ్చు.. సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా బాగుంటుంది..ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాగ్ మరియు వెన్నల కిషోర్ ల మధ్య ఫన్ ట్రాక్
రకుల్ నటన

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో అక్కడక్కడా తడబాటు
అంతగా మెప్పించని పాటలు

ఫైనల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్.. ఫస్టాఫ్ ఆకట్టుకోవడం సెకెండ్ ఆఫ్ యావరేజ్ ఉన్నప్పటికీ కొంచం ఓపిక చేసుకుంటే పర్వాలేదు బాగానే ఉంది అన్న ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here