చిరంజీవి ఫోన్ చేసి ఆలా చేస్తారు అనుకోలేదు .. ప్రభాస్

చిరంజీవి ఫోన్ చేసి మెచ్చుకున్నారు.. ప్రభాస్

0

ప్రభాస్ హీరోగా చేస్తున్న యాక్షన్ మూవీ సాహో సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు భారీగా పెరిగాయి. ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ తో పాటు, హీరోయిన్ శ్రద్దా కపూర్, నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ లు పాల్గొన్నారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్, శ్రద్దా కపూర్లు సమాధానాలు చెప్పారు. ప్రభాస్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పొగుడుతూ ట్వీట్ చేసే రాజమౌళి, సాహో ట్రైలర్ రిలీజ్ తరువాత ట్వీట్ చేయకపోవడం విశేషం. దీనిపై మీడియా ప్రతినిధులు అడగ్గా.. రాజమౌళి ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు. రాజమౌళితో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందలు తెలిపారని.. చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here