ధోనికి సర్ప్రైజ్ ఇచ్చిన భార్య సాక్షి

ధోనికి సర్ప్రైజ్ ఇచ్చిన భార్య సాక్షి

0

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతానికి క్రికెట్ కి కొద్దీ రోజులు సెలవిచ్చి దేశ సేవకై ఆర్మీలో సేవలందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా కాగా ప్రస్తుతానికి ధోని గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో, ఆర్మీతో కలిసి విధుల్లో పాల్గొంటున్నాడు. ఈనెల 15 తేదీ తరువాత మన మిస్టర్ కూల్ ఇంటికి చేరుకుంటారు. అయితే ధోని తన ఇంటికి చేరుకునేలోగా ఎలాగైనా సరే తనకొక సర్ప్రైజ్ ఇవ్వాలని తన భార్య సాక్షి నిర్ణయించుకుంది. ఈమేరకు ధోనికి ఎంతో ఇస్టమైన ‘ఎ జీప్‌ గ్రాండ్‌ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొనుగోలు చేసింది సాక్షి. కాగా ఆ కొత్త కారుని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ‘నీకోసం సరికొత్త టాయ్‌ వెయిట్‌ చేస్తోంది. త్వరలో ఇంటికి రాబోతున్న నీకు వెల్‌కమ్‌. నీకిష్టమైన రెడ్‌బీస్ట్‌ ఇంటికొచ్చింది. నిన్న నేను చాలా మిస్సవుతున్నా’ అని సాక్షి పేర్కొన్నారు.

అయితే సాక్షి చేసినటువంటి ఈ ట్విట్ చుసిన పలువురు నెటిజన్లు ‘గ్రేట్ వైఫ్, బెస్ట్ వైఫ్’ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇక మరికొందరైతే ‘సాక్షి ఫోటో ఎలా అయితే షేర్ చేసావో, ధోని వచ్చాక కార్ డ్రైవ్ చేస్తున్న ధోని వీడియోని కూడా పోస్ట్ చెయ్యు’ అంటూ వాఖ్యానిస్తున్నారు. కాగా ఈ పోస్ట్ చూసాక మన ధోని ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here