శ్రీశాంత్ కు ఎట్టకేలకు ఊరట..

శ్రీశాంత్ కు ఎట్టకేలకు ఊరట..

0

టీమిండియా క్రికెట్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతడిపై జీవితకాల నిషేధం ఎత్తేశారు. ఏడేళ్ల వరకే నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ అంబుడ్స్‌మన్, విశ్రాంత న్యాయ ముర్తి డీకే జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీకాంత్‌కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. ప్రస్తుతం అతడు కేరళ తరపున విదేశీ లీగుల్లో ఆడాలని అతడు కోరుకుంటున్నాడు. కేరీర్‌లో అత్యున్నత దశలో ఉన్న సవుయంలో శ్రీశాంత్ నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్ రాయుల్స్‌కు ఆడుతున్న అతడిపై 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.

అతడితో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. పోలీసులు దర్యాప్తు చేశారు. తనపలు నిషేధం ఎత్తివేయాలని శ్రీశాంత్ న్యాయ పోరాటానికి దిగాడు. దిగువ కోర్టుల్లో కేరళ హైకోర్టులోనూ ఉరట లభించినా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. మళ్లీ మళ్లీ కోర్టులో పిటిసన్ దఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టు అతడి నిషేదం తొలగించింది. శిక్ష తగ్గించి న్యాయం చేయాలని బీసీసీఐ అంబుడ్స్ మన్‌ను ఆదేశించింది. ఆగస్టు 7 తేదిలో అంబుడ్స్‌మన్ డీకే జైన్ తీర్పు వెల్లడించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here