సీమలో హైకోర్టు ఏర్పాటుపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

సీమలో హైకోర్టు ఏర్పాటుపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

0

రాజధాని మార్పు విషయం సర్దుమనిగిన తర్వాత ప్రస్తుతం హైకోర్టు మార్పు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏపీకి చెందిన మూడు ప్రాంతాల్లో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి… శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాలు నినాదాలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఉత్తరవారు కూడా తమకు కావాలని అలాగే గుంటూరు వాసులు రాజధానిలోనే హైకోర్టు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు… ఇలాంటి సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కడప జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ…

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు… ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ది వికేంద్రీకరణ జరగవలసిన అవసరం ఉందని అన్నారు… రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో అభివృద్ది చెందాలనేది తమ అభిమతమని బుగ్గన పేర్కొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here