తెలుగువాడు గర్వించే సినిమా..సైరా రివ్యూ..!

తెలుగువాడు గర్వించే సినిమా..సైరా రివ్యూ..!

0

సైరా రివ్యూ

నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: అమిత్‌ త్రివేది,

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జూలియస్‌ ఫాఖియం

సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి

తెలుగు చలన చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక క్రేజ్…. ఆయన తెరంగేట్రం చేసినప్పుడు ఎవరి రెకమెండేష్ తీసుకోకుండా స్వతహాగా అంచెలంచెలుగా ఎదుగుతు వచ్చిన నటుడు చిరంజీవి… టాలీవుడ్ లో సుమార్ 149 చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు… అయితే 149 చిత్రం తర్వాత చిరు రాజకీయాల్లోకి వెళ్లారు…

రాజకీయాల్లో ఉంటూ సిమాలకు సుమారు 7 సంవత్సరాలు దూరంగా ఉన్నారు… తర్వాత రాజకీయలకు స్వస్తి చెప్పి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందు వచ్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. అనంతరం మెగాస్టార్ 13 సంవత్సరాల కలగా ఉన్న ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా చేయాలని అనుకున్నాడు. అప్పటి రోజుల్లో ఆ సినిమా చేయాలంటే చాల బడ్జెట్ అవుతుంది. సాంకేతికంగా పెద్దగా అభివృద్ధి సాధించలేదు. దీంతో ఇప్పటి వరకు ఆగాల్సి వచ్చింది. రామ్ చరణ్ కు ధృవ వంటి మంచి హిట్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా తెలుసుకుందాం.

కథ:

అనగనగా రాయలసీమలోని రేనాడు ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఆ 61 ప్రాంతాలు కూడా చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్నాయి. అయితే, వీరి మధ్య ఐక్యత లేదు. ఒకరంటే మరొకరికి పడదు. అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది. వర్షాలు లేక, పంటలు పండగ నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పన్నులు కట్టాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తీసుకొస్తారు. ప్రజలను హింసిస్తుంటారు. అలాంటి సమయంలోనే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే, 61 పాలెగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు పడతారు. అనంతరం 61 మంది పాలెగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నారు అన్నది చిత్ర కథ.

విశ్లేషణ..

సినిమా కథను మొదట రేనాడు గురించి కాకుండా ముందుగా ఝాన్సీలక్ష్మీ భాయ్ తో ప్రారంభించారు… బ్రిటీష్ వారు ఝాన్సీ భాయ్ పై దండెత్తుతారు…. వారిని ఆమె ఎదుర్కుంటుంది.. ఝాన్సీ సైనికులు కూడా బ్రిటిష్ వారిపై పోరాటం మొదటు పెడతారు… ఆ సమయంలో ముందుగా బ్రిటీష్ వారిపై పోరాటం చేసింది మనం కదని ధక్షిణాన రేనాడు ప్రాంతానికి చెందిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పోరాటం చేసారని అనుష్క తెలుపడంతో ఈ కథ అప్పుడు రేనాడుపై ప్రాంతానికి మారుతుంది..

ఇక నుంచి అసలు కథ మొదలువుతుంది… విజయనగర రాజుల నుంచి రేనాడు ప్రాంతంలో పాలెగాండ్ల ఉండేవారు వీకింద వందనుంచి 200 వందల గ్రామాలు ఉండేవి అయితే పాలెగాండ్ల మధ్య గొడవలు ఐఖ్యతత్యం లోపించడం అదే సమంయలో బ్రిటీష్ వారు పప్పు వసులు చేసేందుకు రావడంతో కథ స్టార్ట్ అవుతోంది… బ్రిటీష్ వారు ఆ ప్రాంత ప్రజలను ఎలా హింసించి పన్ను వసులు చేసేవారు, ఇవ్వకపోతే వారిని ఎలా హింసించేవారు ఒక్కోక్కటి రివిల్ చేసుకుంటు కథను ముందుకు తీసుకువెళ్ళే విధానం అద్బుతంగా ఉంటుంది…

బ్రిటీష్ పాలకుపై పోరాటం చేయాలంటే ఒక్కరితో కూడుకున్న పని కాదని భావించి నరసింహారెడ్డి చుట్టు పక్కల ఉన్న పాలెగాండ్ల సహాయంతో పోరాటం చేస్తారు… పోరాట సమయంలో డైలాగులు రోమాలు నిక్కబొడుచుకునే విధంగాఉంటాయి… ఇంటర్వేల్ సమయంలో నరసింహారెడ్డి బ్రిటీష్ అధికారిని చంపదడంతో సెకెండ్ ఆప్ పై ఉత్కంఠత ఏర్పడుతుంది… ఇంటర్ వెల్ తర్వాత కథ వేగం పెరిగిపోతుంది.. బ్రిటిష్ అధికారిని హతమార్చిన విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అక్కడి పోరాటాన్ని అణిచివేసేందుకు అత్యంత క్రూరుడైన అధికారిని అక్కడికి పంపుతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలౌతుంది. ఒకవైపు సంస్థానాల మధ్య ఐక్యత తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తున్నాడు. మెగాస్టార్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పోరాట సన్నివేశాలు ఉండటం విశేషం. ఇక క్లైమాక్స్ లో సైరా చిన్న సైన్యం పదివేలమంది బ్రిటిష్ సైనికులను చంపడం అన్నది లాజిక్ కు దూరంగా ఉంది. క్లైమాక్స్ ను భావోద్వేగాలతో ముగించాడు.

నటీనటుల పనితీరు:

మెగాస్టార్ చిరంజీవి సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించాడు. యోధుడిగా మెగాస్టార్ చిరంజీవి నటన అమోఘం. ఇక గురువుగా గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర హుందాగా ఉన్నది. అవుకు రాజుగా సుదీప్, పాండిరాజాగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, బసిరెడ్డిగా రవికిషన్ , నయనతార, తమన్నా ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఇమిడిపోయి నటించారు.

సంకేతికవర్గం పనితీరు:

సైరా సాంకేతికంగా సూపర్ అని చెప్పాలి. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాను నడిపించిన తీరు బాగుంది. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉండే విధంగా చూసుకున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ వండర్ చేసింది. అమిత్ త్రివేది సంగీతం, జులియన్ నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి.

పాజిటివ్ పాయింట్స్:

నటీనటులు

మెగాస్టార్ నటన

వార్ ఎపిసోడ్స్

సాంకేతిక వర్గం పనితీరు

నెగెటివ్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లో సాగతీత

లాజిక్ లేని పోరాటం

చివరిగా : సైరా.. తెలుగువాడు గర్వించే సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here