ఆర్డీఎక్స్ లవ్ రివ్యూ..ప్రేక్షకుడిపై జండు బాంబు..!

ఆర్డీఎక్స్ లవ్ రివ్యూ..ప్రేక్షకుడిపై జండు బాంబు..!

0

ఆర్డీఎక్స్ లవ్ రివ్యూ
నటీనటులు: తేజస్, పాయల్ రాజ్ పుత్
దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత‌లు: సి.కళ్యాణ్
సంగీతం: రధన్
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019

పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఈ పేరు వింటే కుర్రకారు గుండె గుభేలు , పాయల్ రాజ్ పుత్ గ్లామర్ బేస్ చేసుకొని తీసిన సినిమా ఆర్డీఎక్స్ లవ్. ప్రోమోలతోనే టీజర్ లతో కేవలం స్కిన్ షో, బూతు మాటలే చూపించి ఈ సినిమా ఎలా ఉంటుందన్న క్లారిటీ ఇచ్చేసినా, ట్రైలర్ లో మాత్రం సినిమాలో ఏదో ఉందన్న హింట్ ఇచ్చారు. మరి ఆర్డీఎక్స్ లవ్ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దామా.

కథ:
అలివేలు (పాయల్ రాజ్ పుత్) ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకోసమే ఆమె ప్రభుత్వ పథకాలను పేదవర్గాలకు చేరవేసే సామాజిక కార్యకర్త లా పనిస్తుంది . ఈ క్రమంలో తనని చూసి అట్ట్రాక్ట్ అయిన తేజస్ ను వాడుకుని సీఎంతో అపాయింట్మెంట్ సంపాదిస్తుంది. అసలు ఇంతకీ ఈ అలివేలు ఎవరు? ఆమెకు సీఎంతో పనేంటి? ఎందుకని ఆయన్ను కలవడానికి అంతలా ప్రయత్నించింది. కలిసిన తర్వాత ఏం జరిగింది అన్న మిగిలిన కథ.

కథనం :
తొలిభాగంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోతకే పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక తేజస్ ఫ్రెండ్స్ మధ్య నడిచే సన్నివేశాలు చాలా నాసిరకంగా, ఎబ్బెట్టుగా ఉంటాయి. పక్కా అడల్డ్ కంటెంట్‌తో సన్నివేశాలు ఉండటం ఓ దశలో ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బందిగా మారినంత పని అవుతుంది. కేవలం యూత్‌ను టార్గెట్ చేసి తీసిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు లేని సన్నివేశాలతో తొలి భాగం నడుస్తుంది.

ఇక తన ఆశయాన్ని సాధించేందుకు అలివేలు తన శీలాన్ని కూడా పట్టించుకోకపోవడం సినిమాలో డైజెస్ట్ కానీ అంశంగా కనిపిస్తుంది. సీఎం బాపినీడు, రివర్స్ బ్రిడ్జ్ నర్సయ్య (నరేష్), ఆదిత్య మీనన్ పాత్రల్లో పెద్దగా పస లేకపోవడం వల్ల సన్నివేశాలు మరీ నాసిరకంగా కనిపిస్తాయి. ఓవరల్‌గా పాయల్ అందాల ఆరబోత కోసమే సినిమా తీశారా అనే ఫీలింగ్ కలిగేలా ఉంటాయి.

నటీనటులు:
ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ పాయల్ రాజ్ పుత్. ఆమె చుట్టూనే కథ అల్లారు. అయితే పాయల్ ను తీసుకున్న మెయిన్ పర్పస్ వేరు. దానికి ఆమె 100 శాతం న్యాయం చేసింది. నటించాల్సిన కొన్ని సన్నివేశాల్లో కూడా పర్వాలేదనిపించుకుంది. విలన్ గా ఆదిత్య మీనన్ ఇంప్రెస్ చేస్తాడు. తన టాలెంట్ కు తగ్గ పాత్రలు పడట్లేదని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. నరేష్ ఉన్న కాసేపు ఎమోషనల్ చేస్తాడు. సీఎంగా బాపినీడు పర్వాలేదు. తేజస్ ఈ చిత్రంలో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
ఆర్డీఎక్స్ లవ్ లో ముందుగా ఇంప్రెస్ చేసేది సినిమాటోగ్రఫీ. పల్లెటూరు అందాల్ని చక్కగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. చిన్న బడ్జెట్ అయినా కూడా ఎక్కడా రాజీ పడకుండా చేసారు. రధన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ కాదు కానీ ఒకే అన్నట్లుగానే ఉంటాయి. ఎడిటింగ్ ఈ చిత్రానికి ఉన్న ప్రధాన మైనస్ లలో ఒకటి. ఎన్నో సెన్స్ లెస్ సీన్లు ఇందులో ఉన్నాయి. అయినా ఎడిటర్ ఎందుకు అలా వదిలేసాడో అర్ధం కాదు.

ఫైనల్‌గా ఓవరాల్‌గా RDX లవ్ సినిమా కథ నాసిరకమైన ప్రేమకథ. అడల్డ్ కంటెంట్ తప్ప మరో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కనిపించదు. కథ, కథనాలు ఏ మాత్రం ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న విభిన్నమైన చిత్రాల మధ్య RDX లవ్ ఓ పేలవమైన సినిమా అని చెప్పవచ్చు.

ఆర్డీఎక్స్ లవ్ – ప్రేక్షకుడిపై జండు బాంబు

రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here