గంగూలీ ర‌విశాస్త్రీని అంత ఈజీగా వ‌దిలేస్తాడా..!

గంగూలీ ర‌విశాస్త్రీని అంత ఈజీగా వ‌దిలేస్తాడా..!

0

ఒక రూఫ్ కింద ఉన్నా క్రిడాకారులు అంద‌రూ ఒకేలా ఉండాలి అని లేదు, అలాగే ఆట‌ల్లో కూడా అంతే, క్రీడాకారులు కోచ్ లుగా టీమ్ కెప్లెన్లుగా మారిన వారు ఎంద‌రో ఉన్నారు.. జాత‌కం మార్చేది వారి ఆట ప్ర‌ద‌ర్శ‌న అనే చెప్పాలి.. క్రికెట్లో ఇలాంటివి చాలా జ‌రిగిపోతూ ఉంటాయి. ధోనీ సాధార‌ణ క్రికెట‌ర్ గా క్రికెట్లోకి ఎంట‌ర్ అయినా కూల్ కెప్టెన్ గా మారాడు.. విరాట్ కూడా దూకుడుతో కెప్టెన్ అయ్యాడు, అలా నాటి నుంచి నేటి వ‌ర‌కూ క్రీడాకారులు ఊహించ‌ని రేంజ్ లోకి వెళ్లారు, అంతా వారి ఆట ప్ర‌దర్శ‌న వ‌ల్లే అని చెప్పాలి.

తాజాగా టీమిండియా మాజీ సారథి, క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షపదవికి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇక నామినేష‌న్ ఎవ‌రైనా వేస్తే పోటీ ఉంటుంది కాని సౌర‌వ్ కు ఈ పోటీ అనేది లేదు ..ఆయ‌న మిన‌హ మ‌రెవ్వ‌రూ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌లేదు. దీంతో ఆయ‌న ఏక‌గ్రీవం అయిన‌ట్లే .. బీసీసీఐ నూత‌న అధ్య‌క్షుడిగా ఆయ‌న నిర్ణ‌యాలు ఎలా ఉంటాయి అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ అంటే ఎన్నో స‌వాళ్ల‌తో కూడుకుని ఉన్న బోర్డు.

ఇక గంగూలికి మెయిన్ గా ఓ విష‌యంలో మాత్రం ఎదురుదెబ్బ అని క్రీడాభిమానులు చ‌ర్చించుకుంటున్నారు .. దానికి కార‌ణం
టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి. ఎన్నో ఏళ్లుగా గంగూలీకి ర‌విశాస్త్రీకి మ‌ద్య వివాదాలు ఉన్నాయి.. ఇద్ద‌రూ స‌రిగ్గా మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.. 2016లో టీమిండియా కోచ్‌ పదవికి తనను రిజెక్ట్‌ చేయడానికి గంగూలీనే ప్రధాన కారణమని రవిశాస్త్రి ఎన్నో సార్లు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు దిగాడు. కాని గంగూలీ మాత్రం మీడియా ముందు ఎక్క‌డా టంగ్ స్లిప్ అవ్వ‌లేదు.. ఇక గంగూలీ బీసీసీఐ సార‌ధిగా వ‌స్తే శాస్త్రీ టీమ్ అవుట్ అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here