నోటిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవండి..!

నోటిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవండి..

0

చాలా మంది నోటిలో ఇన్ఫెక్షన్ ఉంది అని భాధపడతారు… వారికి నిమ్మకాయ దివ్య ఔషదం అనే చెప్పాలి..సిట్ర‌స్ జాతికి చెందిన పండ్ల‌లో నిమ్మ‌పండ్లు కూడా ఒక‌టి. వీటి నుంచి వ‌చ్చే సువాస‌న అంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఇష్ట‌మే. అయితే నిత్యం ఆపిల్ తింటే ఎంత లాభం, డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు, అలాగే నిమ్మకాయ తీసుకున్నా డాక్టర్ అవసరం ఉండదు, కడుపులో ఉన్న విష చెడు వ్యర్ద పదార్ధాలు అన్నీ బయటకు వస్తాయి నిమ్మరసంతో, తక్షణ ఎనర్జీ వస్తుంది. నిమ్మ‌కాయ‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అలాగే నిమ్మ‌రసాన్ని నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగితే దాని వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. దంతాల వరుస బాగుంటుంది తెల్లగా మారతాయి. అలాగే పలు ఇన్పెక్షను తొలగిస్తాయి. ముఖ్యంగా నోటి ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి.

1.ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అంటే ఆరుగంటలకు మీరు 200 ఎం ఎల్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పీహెచ్ స‌మ‌తుల్యంలో ఉంటుంది.

2. నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే విష, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. మీకు జలుబు వారం రోజులు అయినా తగ్గకపోతే ఇలా నిమ్మరసం తాగండి తర్వాత పాలు టీ కాఫీ తాగకండి వెంటనే జలుబు తగ్గుతుంది

3.. రోజూ ఒక నిమ్మకాయతో వాటర్ తాగితే దంత స‌మ‌స్య‌లు ఉండ‌వు. చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

4.. ఇక నిమ్మ తొక్కలను ఉడకచెట్టి ఆ వాటర్ ని వడకట్టి ఆ నీరు పుక్కలిస్తే మీకు నోటి దుర్వాసన ఇన్పెక్షన్లు తొలగిపోతాయి

5. పళ్లమీద పాచి గార లేకుండా చూసుకోవాలి, అలాగే లవంగాలు పౌడర్ చేసుకుని ఆ పౌడర్ వేడి నీటిలో వేసి మరిగించి తాగినా పుక్కలించినా మీకు నోటి స్మెల్ అలాగే దంతాల పక్కన చిగురు ఇన్పెక్షన్ తగ్గిపోతుంది.

6.వేప ఆకులు చూర్ణంగా చేసి నోటి దవడల పక్కన కొద్ది మొత్తంలో పెట్టుకోండి చేదుగా ఉన్నా అక్కడ ఇన్పెక్షన్ సమస్య తగ్గిస్తుంది

7.. వేప ఆకులు పౌడర్ చేసుకుని దానిని వేడి నీటిలో వేసి పుక్కలించినా మీకు సమస్య ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here