వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు… ఆయన లక్కీనెంబర్ మూడు కనుక ఈనెల మూడవ తేదీన వంశీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు…

ఇక ఆయన్ను బుజ్జగించేందుకు ఎంపీ కేసినేని నాని అలాగే కొనకళ్ల నారాయణలు దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు….. ఈ చర్చలు విఫలం అయ్యాయి… తాను వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారట వంశీ… ఈ సందర్భంగా వంశీ తనపై అన అనుచరులపై నమోదు అయిన కేసుల గురించి టీడీపీ నేతలకు వివరించారు…

కాగా ఇటీవలే వంశీ టీడీపీ సభ్యత్వానికి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తొలుత అందరు ఆయన బీజేపీలో చేరుతారని భారించారు…. కానీ అనుచరుల మేరకు వైసీపీలో చేరనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here