రాత్రి 12 గంటలకు పడుకుంటున్నారా అయితే ఈ జబ్బులు మీకు వస్తాయి..!

రాత్రి 12 గంటలకు పడుకుంటున్నారా అయితే ఈ జబ్బులు మీకు వస్తాయి..!

0

మనలో చాలా మంది ఉదయం నిద్ర తొందరగా లేస్తారు, మరికొందరు మాత్రం చాలా లేట్ గా లేస్తారు.. ఉదయం 10 గంటలకు ఆఫీసు అయితే, 9 గంటలకు లేచి స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్ కు ఆదరాబాదరా వెళ్లేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ఉదయం ఇలా ఆఫీసుకి తొందరగా వెళ్లే సమయంలో, ఇంపార్టెంట్ ఫైల్స్ మర్చిపోతారు. అలాగే మరిన్ని తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతాయి.

అయితే ముఖ్యంగా మనం ఉదయం తొందరగా లేవాలి అంటే, కచ్చితంగా రాత్రి తొందరగా పడుకోవాలి.. ఇలా పడుకునే సమయంలో మనం మొబైల్స్ సినిమాలు టీవీలు చూస్తూ ఉంటాం.. దీని వల్ల మన మెదడు సరిగ్గా పనిచేయదు. రాత్రి కంటి మంటలు వచ్చి ఉదయం లేవడానికి బద్దకంగా చూస్తాం, అందుకే లేట్ నైట్ పార్టీలకు వెళ్లినా అతిగా టీవీలు చూసినా మొబైల్స్ వాడినా, రాత్రి సమయాల్లో నిద్రలేకపోతే ఉదయం చాలా బద్దకంగా కనిపిస్తారు. ఆఫీసుల్లో పని కూడా సరిగ్గా చేయలేరు.

అయితే దీనిపై తాజాగా పరిశోధనలు కూడా చేశారు. రాత్రి పడుకునే సమయంలో కరెక్టుగా 9 గంటలలోపు అని చెబుతున్నారు, కచ్చితంగా రాత్రి 9 గంటలకు పడుకుని ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెబుతున్నారు.. అంతేకాదు మీరు రాత్రి సమయంలో ఉద్యోగాలు చేస్తే వాటిని అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. ఇది మీ శరీరం పై వచ్చే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని చెబుతున్నారు వైద్యులు.

మీరు 12 గంటల తర్వాత పడుకుంటే మీ మేధస్సు తక్కువగా ఉంటుందట.
మీకు నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు సరిగ్గా పని చేయదు, అంతేకాదు మీరు అందరితో కలుగోలుపుగా ఉండలేరు
చాలా వరకు జంతువులని అసహ్యించుకుంటారు.
అతిగా తిండికి అలవాటు పడతారు.
చలాకిగా ఉండలేరు.
సమాజంలో చాలా బద్దకంగా మారిపోతారు.
హర్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది.
లేజీ నెస్ ఉంది అనేది అందరికి కనిపిస్తుంది.
కార్టిజాల్ పెరగడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది.

సో అందుకే రాత్రి 12 గంటల తర్వాత పడుకునే అలవాటు మానుకోండి, రాత్రి 9 గంటలకు కచ్చితంగా పడుకుంటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here