మెగాస్టార్ ఆ కొత్త ప్రాజెక్ట్ ను ఒప్పుకుంటారా..!

మెగాస్టార్ ఆ కొత్త ప్రాజెక్ట్ ను ఒప్పుకుంటారా..!

0

బిగ్ బ్రదర్స్ నుంచి మన ఇండియాలో బిగ్ బాస్ గా వచ్చింది. సీజన్ వన్ తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే, సీజన్ 2 నాని చేశారు, ఇకసీజన్ 3 టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. నిన్నటితో తెలుగులో మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చ అప్పుడే టాలీవుడ్ వయా తెలుగులో మొదలు అయింది. అయితే మరో ఆరు నెలల వరకూ ఈ టైటిల్ విన్నర్ గురించే చర్చ నడుస్తుంది, తర్వాత మళ్లీ కొత్త షో కు ఎంపిక జరుగుతుంది.

ఈ సమయంలో గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా అలరించిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ 4 కు హోస్ట్ అయితే బాగుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చిరు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగానే అద్బుతమైన టీఆర్పీ వచ్చింది. అసలు అదిరిపోయే టైమింగ్ తో చెలరేగిపోయిన చిరు హౌస్ పార్టిసిపెంట్స్ తో సరదా సంభాషణలతో అందర్ని నవ్వించారు, దీంతో టీఆర్పీ అమాతం పెరిగిపోయింది.

టాలీవుడ్ లో 40 ఏళ్ల సినిమా జీవితంలో చిరంజీవి చాలా చూశారు, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ లో కొట్టేవాళ్లే లేరు అనే చెప్పాలి, తాజాగా నిన్నటి ఫైనల్ మరోసారి రుజువు చేసింది. ఇంటి సభ్యులు అందరిని పలకరించిన విధానానికి ఫిదా అయ్యారు, అందుకే బిగ్ బాస్ 4 భారీగా ప్లాన్ చేసి చిరంజీవిని హోస్ట్ ని చేయాలని కోరుతున్నారు అభిమానులు.. మరి చూడాలి సోషల్ మీడియా పిలుపుపై వచ్చే ఏడాది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే మెగా స్టార్ ఎప్పుడూ అభిమానులని అలరించడానికి ప్రయత్నిస్తారు. కచ్చితంగా ఆయన దీనికి ఒప్పుకుంటారు అని కామెంట్లు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here