పెయింటర్ కు కోట్ల రూపాయల లాటరీ : టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్..!

పెయింటర్ కు కోట్ల రూపాయల లాటరీ : టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్..!

0

దేవుడు ఇవ్వాలేకాని దరిద్రం అనుభవించిన వాడు కూడా ధనవంతుడు అవుతాడు..బికారి కూడా బిలియనీర్ అవుతాడు..ఇత్తడి అమ్మేవాడు పుత్తడి అమ్మేరేంజ్ కు వెళతాడు ..అయితే కష్టపడి సంపాదించేవారి దారి ఒకటి అయితే , వారి లక్ ఫేట్ తో వచ్చే సంపాదన మరొకటి అని చెప్పాలి.అలాంటి వాటిలో లాటరీ ఒకటి మంచి సంపాదన అని చెప్పాలి.. ప్రపంచంలో అగ్రశ్రేణి లాటరీ కంపెనీలు వందల కోట్ల రూపాయల లాటరీలు ప్రతీ సంవత్సరం ఇస్తాయి, అలా కొన్ని టికెట్ కు లాటరీ తగిలితే ఒక్క టికెట్ మీ లైఫ్ నే మార్చేస్తుంది, ముఖ్యంగా దుబాయ్ లాటరీ ప్రపంచంలోనే చాలా పెద్ద మొత్తంలో అందించే అమౌంట్…తాజాగా భగవంతుడు తలచుకుంటే మన తలరాత క్షణాల్లో మారిపోతుందని నిరూపించాడు ఓ వ్యక్తి. మరి అతనికి వచ్చిన లక్ ఏమిటో చూద్దాం..

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలోని చురూడూ గ్రామానికి చెందిన పెయింటర్ సంజీవ్ కుమార్ కు 2.50 కోట్ల రూపాయల లాటరీ వచ్చింది దీంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు… సంజీవ్‌కుమార్ పంజాబ్ స్టేట్ దివాలీ బంపర్ లాటరీలో ఈ డబ్బులు గెలుచుకున్నాడు
మరి ఈ టికెట్ రేటు ఎంతో తెలుసా? సంజీవ్‌కుమార్ ఈ లాటరీ టిక్కెట్‌ను రూ. 500 కు కొనుగోలు చేశాడు. తనకు ఇంత డబ్బు రావడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ 10 లక్షలు కూడాచూడలేదని కాని ఏకంగా కోట్ల రూపాయలు వచ్చాయి అని ఆనందంగా ఉన్నాడు, మంచిగా తన బిడ్డలని చదివిస్తా అంటున్నాడు సంజీవ్.

తమ ప్రాంతానికి చెందిన సంజీవ్ కు ఇంత పెద్ద మొత్తంలో లాటరీ రావడంతో తమ ఊరుపేరు మార్మోగిపోతోందని, ఆ డబ్బుతో మంచి ఇల్లు కొనుక్కొని వ్యాపారం పెట్టుకుంటే సంతోషం అని అతని తల్లిదండ్రులు స్ధానికులు కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here