తిప్పరా మీసం : మూవీ రివ్యూ : మీసం తిప్పేలా ఉందా ??

తిప్పరా మీసం మీసం తిప్పేలా ఉందా ??

0

నటీనటులు : శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి

దర్శకత్వం : కృష్ణ విజయ్ఎల్

నిర్మాత‌లు : రిజ్వాన్

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫర్ : సిధ్

కృష్ణ విజయ్ .ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో శ్రీవిష్ణు నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం తిప్ప‌రా మీసం.ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది.ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

(శ్రీవిష్ణు) మణిశంకర్ చిన్న తనంలో చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. ఆ క్రమంలో చివరికి తన తల్లి(రోహిణి) పైనే ద్వేషం పెంచుకుని ఆమెను శత్రువులా చూస్తుంటాడు. అయితే ఇలాంటి మణిశంకర్ పెరిగి పెద్దయ్యాక ఒక పబ్ లో డీజే గా పని చేస్తూ.. విపరీతంగా బెట్టింగ్స్ చేస్తూ కొన్ని ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కుంటాడు. బెట్టింగ్స్ కారణంగా అతని జీవితం ఉహించని మలుపు తిరుగుతుంది.అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేషణ:

తల్లీకొడుకుల బంధం విలువ కట్టలేనిది అలాంటి తల్లిని కోర్టుకీడ్చిన కొడుకు.చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉంది . సినిమా మొదటి భాగం స్లో గా సాగుతుంది . మణి క్యారెక్టర్‌ను హైలెట్ చేయడానికి ఫస్టాఫ్‌ అంతా సాగుతుంది .దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు .ఇక మోనికా (నిక్కీ తంబోలీ) తో లవ్ సీన్స్ కూడా పెద్దగా లేవు చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్‌ సరిగ్గా డీల్‌ చేసినట్టు అనిపిస్తుంది.

సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్‌ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా..నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్‌ ‘తిప్పరా మీసం​’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు.

కృష్ణ విజయ్ .ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు – నిక్కీ హీరోహీరోయిన్లుగా మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. అయితే సినిమాలో శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here