మరోసారి హాట్ న్యూస్ గా మారిన అల్లు అర్జున్ ఏంటంటే..!

మరోసారి హాట్ న్యూస్ గా మారిన అల్లు అర్జున్ ఏంటంటే..!

0

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ లో చిరంజీవి..పవన్ కళ్యాణ్ తరువాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అయన సినిమాలు సోషల్ మీడియాలో ఓ సంచలనం. ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కలసి చేస్తున్న చిత్రం అల వైకుంఠపురం దీని గురించి అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటె జూబ్లీ హిల్స్‌లో అల్లు అర్జున్ తన కొత్త ఆఫీసును ఓ రేంజ్ లో నిర్మిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కొత్త ఆఫీస్ కి భారీగా ఖర్చు చేస్తున్నారని టాక్. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకి ఇంత పెద్ద ఆఫీస్ ఉండటం ఇదే మొదటిసారి అంటున్నారు సినీ జనాలు.

అల్లు అర్జున్ నిర్మిస్తున్నఈ భారీ ఆఫీసు లో అతని సినిమాలు ఇంకా గీతా ఆర్ట్స్ యాడ్స్ ప్రదర్శనకు ఉంచుతారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఇంకా విజిటర్స్ కూర్చునేందుకు ఇది వీలును కల్పిస్తుంది. అంతే కాదు, తన అభిమానులతో సంభాషించేందుకు వీలుగా ఒక పెద్ద హాల్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసమే మొత్తం కార్యాలయం కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉండేలా ప్లాన్ సిద్ధంచేస్తున్నారు.

ఇంతేకాదు.. అల్లు అర్జున్ ఆఫీస్ లో ఒక ప్రత్యేక మీడియా గదిని కూడా కేటాయించారు, అక్కడ అతను మీడియా వారిని కలుసుకోవచ్చు.. ఇంటర్వ్యూలు, విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించవచ్చు.అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కారవాన్‌ కూడా ఓ సంచలనమే.మొన్న కొత్త ఇళ్ళు ..ఇప్పుడు కొత్త ఆఫీస్ మరో సారి అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారాడు అని చెప్పవచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here