కొహ్లీ బ్యాటింగ్ జోరు మరో ప్రపంచ రికార్డు బద్దలు ..!

కొహ్లీ బ్యాటింగ్ జోరు మరో ప్రపంచ రికార్డు బద్దలు ..!

0

విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీం లో ఓ కెరటం . ఒంట్టి చేత్తో టీం ను గెలిపించగల సత్తా ఉన్న క్రికెటర్. వన్ డే అయిన 20 -20 అయిన టెస్ట్ మ్యాచ్ లు అయిన పరుగుల సాధించడంలో విరాట్ కి ఎవరు సాటిరారు. తాజాగా టెస్ట్ క్రికెట్ ప్రపంచ రికార్డుల ఖాతాలో మరో రికార్డును జమ చేసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలు రాయిని చేరిన కెప్టెన్ గా నిలిచాడు.

ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న 97 ఇన్నింగ్స్ లో 5వేల పరుగుల రికార్డును విరాట్ కొహ్లీ 86 ఇన్నింగ్స్ లోనే సాధించడం విశేషం.

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ లాయిడ్ 106, గ్రీమ్ స్మిత్ 110, బోర్డర్ 116, స్టీఫెన్ ఫ్లెమింగ్ 130 ఇన్నింగ్స్ లో 5వేల పరుగులు సాధిస్తే…కొహ్లీ మాత్రం కేవలం 86 ఇన్నింగ్స్ లోనే 5వేల పరుగులతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ప్రారంభమైన డే-నైట్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే కొహ్లీ అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

బంగ్లాదేశ్ తో ప్రస్తుత సిరీస్ లోని రెండో టెస్టు వరకూ 84 టెస్టులు, 141 ఇన్నింగ్స్ లో 7వేల 100 పరుగులు, 26 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత 31 సంవత్సరాల విరాట్ కొహ్లీకి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here