క్రియేటివ్ దర్శకుడు చిత్రంలో హాట్ అనసూయకు కీలక పాత్ర..!

క్రియేటివ్ దర్శకుడు చిత్రంలో హాట్ అనసూయకు కీలక పాత్ర..!

0

బుల్లితెర ‘జబర్దస్త్’ కామెడీ షోతో తన హాట్ అందాలతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ.కొన్ని సినిమాలో నటించిన పెద్దగా ఉపయోగం లేదు. సోగ్గాడే చిన్నినాయనా లో మన్మధుడు నాగార్జున తో ఒక సాంగ్ లో నటించడం తో అనసూయ రేంజ్ అమాంతం పెరిగి పోయింది.

ఆ తరువాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులను ఆలా కట్టిపడేసింది. ఆ తరువాత ఆమె లీడ్ రోల్ లో చేసిన కథనం మూవీ ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

ఆయన సరే ఆమెకు ఉన్న పాపులారిటీ తో వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఈమె చిరంజీవి -కొరటాల సినిమాలో అంతేకాకుండా సుకుమార్ – అల్లు అర్జున్ సినిమాల్లో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.అంతేకాకుండా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను చాలా యేళ్ల తర్వాత తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కూడా అనసూయ లీడ్ రోల్ లో నటించబోతున్నట్టు సమాచారం. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూతురు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.అనసూయ పాత్రే ఈ సినిమాలో కథలో కీలకం అని ఫిలిం నగర్ సమాచారం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here