పవన్ కళ్యాణ్ తన భార్యకు అయ్యప్పస్వామి గురించి ఏమి చెప్పాడంటే..!

పవన్ కళ్యాణ్ తన భార్యకు అయ్యప్పస్వామి గురించి ఏమి చెప్పాడంటే..!

0

పవన్ కళ్యాణ్ రాయలలసీమ 6 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు తిరుపతి లో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు.ఒక్కో మతానికి ఒక్కో ధర్మం ఉంటుందని, దాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.

అంతేకాకుండా శబరిమలలో మహిళల ప్రవేశం గురించి అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం తన భార్య అన్నా లెజినోవో శబరిమల గురించి..శబరిమలకు తానెందుకు వెళ్లరాదని ఆమె తనను అడిగిందన్నారు.

దానికి పవన్ సమాధానం ఇస్తూ నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?” అని అడిగానన్నారు. దానికి సమాధానంగా లెెజినోవా అది తమ సంప్రదాయమని చెప్పిందన్నారు. మీకు మీ సంప్రదాయం లాగానే… శబరిమలలో కూడా అది సంప్రదాయమని చెప్పాను.

అంతేకాకుండా అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని తన భార్యకు వివరించానన్నారు పవన్ కల్యాణ్. ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని తెలిపారు పవన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here