అసెంబ్లీ కి రాకుండా గేట్ కి తాళం .. గవర్నర్ కి ఘోర అవమానం..!

అసెంబ్లీ కి రాకుండా గేట్ కి తాళం ..గవర్నర్ కి ఘోర అవమానం..!

0

పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడు కి ఘోర అవమానం జరిగింది అని చెప్పుకోవాలి. అసలేం జరిగిందంటే..ఈ రోజు పశ్చిమ బెంగాల్ స్పీకర్ ‌గవర్నర్‌ అజైదీప్ ధన్‌కర్ ను మీటింగ్‌కు ఆహ్వానించారు. అయితే, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ అసెంబ్లీ గేటు నంబరు 3 నుంచి లోపలికి వెళ్లేందుకు రెడీ కాగా, అక్కడున్న సిబ్బంది అప్పటికే గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో గవర్నర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు.

ఇక దీనిపై గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఒక్కసారిగా కోపంతో ఉగిపోయే అక్కడ ఉన్న మీడియా తో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్య చరిత్రకు అవమానం చేసిందని అన్నారు. తనను అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం వేశారని చెప్పారు.స్పీకర్ మీటింగ్ అని పిలిచి,చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

అయితే మమతా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు బిల్లులు గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా,ఆయన ఆలస్యం చేస్తున్నారని, దీనికి నిరసనగానే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంతేకూండా గతం లో మమతకు-అజైదీప్ పాలనా విషయంలో గొడవలు జరిగాయని పలువురు రాజకీయ నాయకుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here