పవన్ కల్యాణ్ పెళ్లిళ్లలపై గురించి మాట్లాడే వారికీ సిగ్గు ఉందా : నరేష్ సంచలన వ్యాఖ్యలు..!

పవన్ కల్యాణ్ పెళ్లిళ్లలపై గురించి మాట్లాడే వారికీ సిగ్గు ఉందా : నరేష్ సంచలన వ్యాఖ్యలు..!

0

నటుడు నరేశ్ కృష్ణ – విజయనిర్మల వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. అయన కామెడీ హీరో గా మంచి పేరు తెరిచుకున్నాడు. అయన నటించిన ‘జాంబ లాడికి పంబ’ ఇప్పటికి ఆ సినిమా చూస్తే బోరు అనేది కొట్టదు ఆ విషయం అందరికి తెలిసిందే.

అయితే సీనియర్ నటుడు నరేశ్ ప్రస్తుతం మంచి మంచి రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు. అయన ‘మా’ అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు. అయితే తాజాగా అయన ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయల పై అయన వ్యతిగత జీవితం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తీ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడని, ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి సిగ్గు అనిపించదా అని ఘాటుగా ప్రశ్నించారు.

అంతేకాకుండా ‘ఐ లైక్ పవన్ కల్యాణ్.. ఐ సపోర్ట్ పవన్ కల్యాణ్. ఎందుకంటే, హై రేంజ్ లో ఉన్నటువంటి కెరీర్ ని వదిలి.. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి పాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయంలోకి కావాలి’ అని అభిప్రాయపడ్డారు.

రాజకీయం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, ఆయన ముందుకెళుతున్న విధానం తనకు నచ్చిందని, ఆయనకు తన నైతిక మద్దతు అని అన్నారు.జీరో పాలిటిక్స్ విధానం చాలా మంచిదని అయన అన్నారు.అంతేకాకుండా ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలని సంచలన వ్యాఖ్యలు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here