కమిషనర్ సజ్జనార్ పై మర్డర్ కేసు నమోదు చేయండి : NGO సంస్థ ఫిర్యాదు..!

సజ్జనార్ పై మర్డర్ కేసు నమోదు చేయండి: NGO సంస్థ ఫిర్యాదు..!

0

యావత్ దేశం దిశ రేప్ అండ్ మర్డర్ తో ఉలిక్కిపడింది.దిశ ను హత్యాచారం చేసిన ఆ నలుగురిని నడి రోడ్ మీద ఉరి తీయాలని దేశం మొత్తం నిరసనలు చేశిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 తేదీన ఉదయం ఆ నలుగురి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై కొంత మంది సంతోషం వ్యక్తం చేసారు- మరి కొంతమంది ఇది సరైన శిక్ష కాదని విమర్శించారు. ఈ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ కూడా జరుపుతోంది.

ఈ ఘటన పై హైదరాబాదుకు చెందిన ‘నేను సైతం’ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ఫిర్యాదు చేసారు. అయితే ఆ నలుగురి నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారని ఆరోపించారు. కమిషనర్ సజ్జనార్ తో పాటు నలుగురు పోలీసు అధికారులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here