తముళ్లు ఇద్దరు దీక్ష : జగన్ కి జై కొట్టిన అన్నయ్య..!

తముళ్లు ఇద్దరు దీక్ష : జగన్ కి జై కొట్టిన అన్నయ్య

0

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఇతర హింసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న‘ఏపి దిశ-2019’ చట్టం పట్ల మెగా స్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. నిజానికి మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు చట్టంలో మార్పులు తేవడాన్ని సమాజంలో అన్ని వర్గాలు అభినందిస్తున్నాయి.మొన్న జరిగిన దిశ రేప్ అండ్ మర్డర్ అందరినీ కలచి వేసిందని .. నేరస్థులను ఎన్ కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులను చిరంజీవి అభినందించారు.

మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటి నేరాల్లో విచారణకు 4నెలలు అంతకంటే ఎక్కువ సమయం పడుతోందని… ఇప్పుడు జగన్ ప్రభుత్వం 21 రోజుల్లోనే ఆ పక్రియ ముగించేలా ప్రత్యేక కోర్టులు, ఇతర సదుపాయలు కల్పించడాన్ని తాను అభినందిస్తున్నట్టు చెప్పారు.

అంతేకాకుండా కొంత మంది సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని శిక్షించేలా చట్టం తేవడం కూడా మంచి పరిణామమన్నారు. దీని వల్ల మహిళలను కించపరచాలన్న ఆలోచన ఉన్న వారిలో భయం కలుగుతుందన్నారు.ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను మనస్పూర్తిగా అభినిందిస్తున్నట్టు చిరంజీవి చెప్పారు.అయితే అంత బాగానే ఉంది అనుకుంటే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.చిరంజీవి జగన్‌ను అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఒకవైపు ఏపీ సీఎం జగన్ విధానాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కి తోడుగా నాగబాబు కాకినాడలో దీక్ష చేస్తుంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఒకరోజు నిరాహార దీక్ష ఈ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

సోదరులు ఇద్దరు కలిసి కాకినాడ దీక్షా శిబిరంలో కూర్చున్న సమయంలోనే చిరంజీవి వారిద్దరికీ షాకిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు.ముఖ్యమంత్రిగా జగన్ నిర్ణయాలను చిరంజీవి హర్షించడం చర్చనీయాంశమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here