అనుష్క కు కోహ్లీ ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా..!

అనుష్క కు కోహ్లీ ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా..!

0

విరాట్ మరియు అనుష్క ఇటలీలో డిసెంబర్ 11, 2017 న వివాహం చేసుకున్నారు. బుధవారం వారి రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వెస్టిండీస్‌తో జరిగిన టి 20 సిరీస్‌లో బిజీగా ఉన్నారు. కానీ వారి రెండవ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా చేయడానికి, ఈ జంట ఒకరినొకరు కోరుకునేలా తమ తమ ఇన్‌స్టాగ్రామ్ లో తమ పెళ్లి నాటి ఫోటో లు పెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ముంబయిలో నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 67 పరుగుల తేడాతో భారీ ఘనవిజయం సాధించి, సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ…ఇది తనకు చాలా ప్రత్యేక ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. డిసెంబరు 11న రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ జరుపుకుంటున్నామని, ఈ ఇన్నింగ్స్‌ తన భార్య అనుష్కకు తానిచ్చే అరుదైన బహుమతని వ్యాఖ్యానించాడు.

నిన్న మ్యాచ్ ముగిశాక వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తో మాట్లాడుతూ తన వెడ్డింగ్‌ యానివర్సరీ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. నిన్న జరిగిన నిర్ణయాత్మక టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడు.29 బంతుల్లోనాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపి 70 పరుగులు సాధించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here