అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్.. టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన..!

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్.. టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన..!

0

ఏపీ అసంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడి గా జరుగుతున్నాయి. రోజు రోజు కి ఒకరి పై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలతో దాడికి ప్రతి దాడి చేసుకుంటున్నారు.ఈ రోజు కూడా అసంబ్లీ లో రచ్చ రచ్చ జరుగుతుంది.ఉపాధి పనుల విషయం లో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు మధ్య ఒకరి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.

ఇక పోతే శాసనసభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే… తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తనేంటో, తన వ్యక్తిత్వం ఏమిటో చంద్రబాబుకు తెలుసని… అన్నీ తెలిసి కూడా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

అన్నీ క్లియర్ గా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరోవైపు సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఉపాధి పనుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here