కడప ప్రజల ఎన్నో ఏళ్ల కలకు సీఎం జగన్ శ్రీకారం..!

కడప ప్రజల ఎన్నో ఏళ్ల కలకు సీఎం జగన్ శ్రీకారం..!

0

కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు… ఆ తర్వాత భారీ బహిరంగసభలో మాట్లాడుతూ…సీల్ ప్లాంట్ శంకుస్థాపన తాను జీవితంలో మరిచిపోలేనని అన్నారు…

ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారని….అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరునెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ది అంటారని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నారు…పాలనలో తేడా అంటే ఇదే అని అన్నారు…

రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే నీరు కావాలని పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలని అన్నారు…

ఇవి ఎంత అవసరమో తనకు తెలుసని అన్నారు జగన్…. అందుకే రాయలసీమ కరువు చరిత్ర మార్చడంకోసం సున్నపురాళ్లపల్లెలో ఉక్కు కార్మాగారానికి శంకుస్థాపన చేశామని అన్నారు… మూడేళ్లలోనే ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు…

15 వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడేళ్ళ కాలంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. దీని కోసం ఎన్.ఎం.డి.సి.తో ముడి ఉక్కు సరఫరాకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పారాయన.

దేశానికి మరో పదేళ్ళలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమవుతుందని, అందులో పది శాతం అంటే 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు కడప ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్.

అంతేకాకుండా కేంద్రం సహకరించక పోయిన ఏపీ ప్రభుత్వం సొంత ఖర్చుతోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తి చేస్తుందని వెల్లడించారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here