‘ప్రతిరోజూ పండగే’ పై అల్లు అర్జున్ కామెంట్.. సెల్ఫ్ డబ్బా అంటున్న నెటిజన్స్..!

'ప్రతిరోజూ పండగే' పై అల్లు అర్జున్ కామెంట్.. సెల్ఫ్ డబ్బా అంటున్న నెటిజన్స్..!

0

మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ వచ్చిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాకుండా మంచి వసూళ్లు కూడా సాధిస్తుంది. అయితే ఈ సినిమా పై అల్లు అర్జున్ కామెంట్ చేస్తూ..‘సినిమా టీంకు కంగ్రాట్స్. నా కజిన్ సాయి తేజ్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

నా స్నేహితుడు మారుతికి మరో విజయం దక్కింది. నా లైఫ్ లైన్ అయిన బన్నీ వాసుకి తన ఖాతాలో మరో మంచి సినిమా పడింది. మా నాన్నకు మంచి లాభాలు వస్తున్నాయి. యూవీ ఫిలింస్ సంస్థకు కంగ్రాట్స్. స్పెషల్‌గా మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కు నా విషెస్’అని తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమాను మెచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ సినిమాను నిర్మించింది ఆయన తండ్రి అల్లు అరవింద్ కాబట్టి.. అల్లు అర్జున్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here