బ్రేకింగ్ : పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో… కారు దిగి.. పాదయాత్రగా..!

బ్రేకింగ్ :పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో… కారు దిగి.. పాదయాత్రగా..!

0

ఏపీ లో మూడు రాజధానిలపై రచ్చ రోజు రోజు కి ఉదృతం అవుతుంది. ఇప్పటికి దాదాపుగా 15 రోజుల నుండి రాజధాని అమరావతి రైతులు భూములిచ్చిన సంగతి తెలిసందే.అయితే ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ సచివాలయంలో ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

పవన్ కల్యాణ్ కృష్ణాయపాలెం నుంచి మందడం వైపు వెళుతున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకూ ఇటువైపు అనుమతించబోమని చెప్పారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవర్నీ అనుమతించేదిలేదని, పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడంతో మందడం గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్‌ అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచె వేసి, పొక్లెయిన్‌ అడ్డుగా పెట్టి కాన్వాయ్‌ ముందుకెళ్లకుండా చేశారు.

దీంతో భారీగా ఉన్న జనసేన కార్యకర్తలు, రైతులు ఇనుపకంచెను తొలగించి పవన్‌ ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేశారు. పవన్‌ కారు దిగి కాలినడకన మందడం బయల్దేరారు. ఈ సందర్భంగా పవన్‌ అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పవన్‌ను అడ్డుకున్న ప్రదేశం నుంచి మందడం గ్రామం.. నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉంది. పాదయాత్రగా మందడం వెళ్తానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఈ సందర్భంగా పవన్‌ హెచ్చరించారు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోకుండా పవన్‌ ముందుకు సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here