నో యాక్షన్ ఓన్లీ రొమాన్స్ అంటున్న ప్రభాస్ .. షాక్ లో అభిమానులు..!

నో యాక్షన్ ఓన్లీ రొమాన్స్ అంటున్న ప్రభాస్ .. షాక్ లో అభిమానులు..!

0

భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ ‘సాహో’ అనుకున్న స్థాయిలో లో ఆకట్టుకోలేక పోయింది. అయితే హిందీ లో వర్షన్ లో మాత్రం హిందీ సినిమాలకు దీటుగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా హాట్ భామ పూజ హెగ్డే నటిస్తుంది. ఇకపోతే జాన్ టైటిల్ ను బట్టి చూస్తే ఈ సినిమాలోనూ భారీ యాక్షన్ సీన్లకి కొదవుండదని అభిమానులు అనుకోవడం సహజం. ఈ సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే వుంటుందట. కథ అనూహ్యమైన మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే ఈ యాక్షన్ సీన్ వస్తుందని అంటున్నారు.

కథ మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని చెబుతున్నారు. ప్రభాస్- పూజా హెగ్డే జంటగా విదేశీ నేపథ్యంలో సాగే ప్రేమకథగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ప్రభాస్ .. పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.మరి ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here