మీడియా పై రెచ్చిపోయిన గుత్తా జ్వాల .. కారణం అదేనా..!

మీడియా పై రెచ్చిపోయిన గుత్తా జ్వాల కారణం అదేనా..!

0

గుత్తా జ్వాల ఈ పేరు చాలా మందికి పరిచయం. ఆమె చేసే రచ్చ కూడా అంత ఇంత కాదు.క్రీడారంగంలో ఆటల కంటే వివాదాలే ఆమెను జనానికి ఎక్కువ పరిచయం చేశాయని చెప్పవచ్చు. గుత్తా జ్వాల – చేతన్ ఆనంద్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే కొత్త ఏడాది సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్‌తో సన్నిహితంగా దిగిన ఆ ఫోటోలు… వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని చెప్పకనే చెబుతున్నాయి.

విశాల్ గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటోను చూసి.. చాలామంది నెటిజెన్స్ వీరు ప్రేమాయణంలో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే తమిళ్ హీరో విష్ణు విశాల్ భార్యతో విడాకులు తీసుకున్నారు..ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి..

గుత్తా జ్వాల ప్రస్తుతం తమిళ హీరో విష్ణు విశాల్‌ తో డేటింగ్ లో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరి మధ్యా లవ్ నడుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో స్పందించేందుకు మాత్రం జ్వాల నిరాకరించింది.

నిన్న రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ అకాడమీ అధికారిక వెబ్‌ సైట్‌ ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా, అదే కార్యక్రమంలో జ్వాల పాల్గొంది. ఆపై ఆమె ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన ఆమె..

ఇండియాకు చాంపియన్‌ లను అందించాలనే టార్గెట్ తో తాను అకాడమీని స్థాపించానని చెప్పిన జ్వాల, సువిశాలమైన ప్రాంతంలో, అత్యున్నత ప్రమాణాలతో 14 బ్యాడ్మింటన్‌ కోర్టులను ఏర్పాటు చేశామని వెల్లడించింది.

నిపుణులైన విదేశీ కోచ్‌ లు, ఫిజియోథెరపిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తనకు సపోర్ట్ కావాలి అందరు సపోర్ట్ చేయండని.. హీరో విష్ణు విశాల్ తో సంబంధం తన వ్యక్తిగతమని, దాని గురించి ఏమీ ప్రశ్నించవద్దని మీడియాపై చిర్రుబుర్రులాడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here