ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

0

ఇక నుచి తాను ఎమ్మెల్యే గా పోటీ చేయనని కర్నూల్ జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు…ఇటీవలే నాయోజకవర్గంలోని జూపాడు సమీపంలో జరిగిన ఓ కార్యక్రమాని హాజరు అయ్యారు ఆర్థర్… అయితే కనీసం సమాచారం లేకుండా వస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ పై కార్యకర్తలు ప్రశ్నించారు…

ఇంటింటికీ తిరిగి ఓట్లడిగిస్తే సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు…దీంతో ఆయన కార్యకర్తల తీరుపై ఆగ్రహం చెందారు…తాను ప్రజలకు ఏదో చేయాలని రాజకీయంలోకి వచ్చానని కానీ ఏదో జరుగుతోందని అన్నారు…

ఇకనుంచి తాను ఓట్లు అడగనని అన్నారు…అలాగే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని అన్నారు… ఇకపై తాను గ్రామానికి రానని పనులు కావాలంటే తన వద్దకే రావాలని వ్యాఖ్యానించారు తాను ఎవరి కాళ్లు పట్టుకోనని అన్నారు…

తన దగ్గరకు ఎవరు వచ్చినా పని చేసిపెడతానని అన్నారు.. కాగా ఆర్థర్ 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఆయన అలా మాట్లాడటం కర్నూలు నగర వ్యాప్తంగా సంచలనంగా మారాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here