రాజకీయాలకు రాయపాటి గుడ్ బై .. కారణం అదేనా..!

0

ఇటీవలే తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే…ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు..సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీ 300 కోట్లు మేర బ్యాంకు రుణాలు తీసుకుంది…

అయితే వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు…ఈ క్రమంలోనే ఆయనపై120 బి రెడ్ విత్ 420 406 468 477 ఏ పీసీఈ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13 (1) డి సెక్షన్ల కింద కేసునమోదు చేశారు అధికారులు…

ఇక తనపై కేసు నమోదు అవ్వడంపై ఆయన స్పందించారు…తన సన్నిహితులే కొందరు తనపై సీబీఐకి ఫిర్యాదు చేశారని రాయపాటి సాంబశివరావు తెలిపారు…అలాగే తాను ఏ పార్టీలో చేరబోవడంలేదని తాను రాజకీయాలనుంచి తప్పుకోవాలనుకుంటున్నానని స్పష్టం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here