మూడు రాజధానులపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

మూడు రాజధానులపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..తాజాగా ఆయన రాయలసీమ అమరావతి నేతలతో సమావేశం అయ్యారు…ఈ సమావేశంలో రాజధానుల మార్పుపై వారి అభిప్రాయాలను తీసున్నారు…ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు…

విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానిదే బాధ్యత అని అన్నారు…అంతేకాదు రాజధానిపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు…రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్నపాత్ర పోషించాలని ఆయన అన్నారు…

ఈ విషయంలో కాంగ్రెస్ అలాగే బీజేపీ తమ వైఖరిని తెలియజేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు…కాగా మరో వైపు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు…మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అని నిరసనలు చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here