సంక్రాంతికి అసలైన సినిమా .. రాజు ఎక్కడున్నా రాజే.!

సంక్రాంతికి అసలైన సినిమా .. రాజు ఎక్కడున్నా రాజే.!

0

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్‌ కాంబోలో గతం లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలాంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ’అల‌… వైకుంఠపుర‌ములో’. కుటుంబ క‌థ‌తోనే ఈ చిత్రం తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెప్తూ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా టబు, జైరాం అలాగే సుషాంత్ మరియు నివేత పేతురాజ్ వంటి నటీనటులు నటించరు

‘నా పేరు సూర్య’తో కంగుతిన్న అల్లు అర్జున్.. కెరీర్లో బాగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’సినిమా చేసాడు. త్రివిక్రమ్ కూడా పవన్ తో 2018 లో భారీ అంచనాలతో వచ్చిన ‘అజ్ఞాతవాసి’తో అటు పవన్ కి ఇటు త్రివిక్రమ్ కి భారీ దెబ్బ పడింది. ఇక గత ఏడాది లో జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత తో మళ్ళి త్రివిక్రమ్ భారీ హిట్ కొట్టాడు. ఇక ముచ్చటగా మూడో సారి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ : బంటు (అల్లు అర్జున్‌) ఓ మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన కుర్రాడు. ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరుతాడు. అక్కడ బాస్ గా హీరోయిన్ పూజా హెగ్డే ఉంటుంది. బంటు మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా ఆయనకు వైకుంఠపురము అనే ఓ పెద్దింటితో సంబంధం ఉంటుంది. ఆ పెద్దింటి యాజమాని ఓ సమస్యలో పడుతాడు. అదే టైంలో పెద్దింటితో తనకు ఉన్న సంబంధం ఏంటో.. తన పుట్టుక వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకుంటాడు బంటు. ఆ టైంలో అతను వైకుంఠపురంలోకి వెళ్లాల్సి వస్తోంది. మరి అక్కడికి వెళ్లి ఏం చేశాడు ? ఆ ఇంట్లో ఉన్నవాళ్ల మనసుల్ని ఎలా గెలిచాడు ? వాళ్ల సమస్యల్ని ఎలా తీర్చాడు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అసలు సిసలైన సంక్రాంతి బొమ్మగా వచ్చింది. కథ అంత గొప్పగా లేకున్నా తన కథనంతో మనసుని కదిలించే మాటలతో మెప్పించాడు త్రివిక్రమ్. సినిమాలో తనకు వచ్చిన ప్రతి సందర్భాన్ని బాగా వాడుకున్నడు త్రివిక్రమ్ శ్రీనివాస్..

త్రివిక్రం మాటలకు బన్ని నటన అబ్బో సినిమాకు కొత్త అందం తెచ్చింది. సినిమాలో కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ ను సీట్లలో కూర్చోనివ్వదని చెప్పొచ్చు. మెప్పించే కథ.. అదే విధంగా మెప్పించే కథనం.. పండుగ వేళ ఫ్యామిలీతో చూసే మంచి సినిమాగా అల వైకుంఠపురములో ఉంది. ఇది ఉంది అది లేదు అని కాకుండా క్లాస్, మాస్ ఆడియెన్స్ అలరించేలా సినిమా ఉంది.

కథ, కథనాలే కాదు హీరో, హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ వారి మధ్య రొమాన్స్, డైలాగ్స్, మ్యూజిక్ ఒకటేంటి ఈ సినిమా సగటు సిని ప్రేక్షకుడికి సైతం విజిల్స్ వేసేలా ఉంది. ఇక సినిమాలో ఒక సీన్ లో బన్ని స్టార్స్ అందరి పాటకి డ్యాన్స్ వేయడం.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పడం చూస్తే మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా సంక్రాంతి పండుగ మరింత హుశారెత్తించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడం.. బన్ని స్టైల్ లో వెళ్లగా.. సెకండ్ హాఫ్ మొత్తం త్రివిక్రం తన సత్తా చాటాడు.

వెన్నెల కిషోర్- సునీల్ కామెడీ, టబు-జయరాం మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయట. మొత్తానికి గురూజీ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్వాగ్, తమన్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ గ్లామర్ చిత్రానికి బాగా ప్లస్ అయిందట. మొత్తానికి అటు మాస్‌ను, ఇటు క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే విధంగా త్రివిక్రమ్ ఫుల్ ట్రీట్ ఇచ్చారు.

ఫైనల్ గా సంక్రాంతికి అసలైన సినిమా.. రాజు ఎక్కడున్నా రాజే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here