జగన్ తో తాడో పేడో అక్కడే తేల్చుకుంటా : పవన్..!

జగన్ తో తాడో పేడో అక్కడే తేల్చుకుంటా : పవన్..!

0

కాకినాడలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే జనసేన కార్యకర్తలమధ్య తాజాగా ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే…ఈ ఘర్షణలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి…

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు…ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు…కాకినాడలో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ అధికారులు, అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి, జనసేన నాయకులు మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడితే సహించనని అన్నారు…కేసు పెడితే…తాను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటామని హెచ్చరించారు…

కాగా అమరావతిలో పవన్ పార్టీ నేతలతో అలాగే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే ఈ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీనుంచి ఆయనకు ఫోన్ రావడంతో హడావుడిగా బయలుదేరారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here