సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం .. ఎస్వీబీసి చైర్మన్ గా ఎవరు అంటే..!

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం .. ఎస్వీబీసి చైర్మన్ గా ఎవరు అంటే..!

0

గత టీడీపీ సర్కార్ లో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా దర్శకేందుడు రాఘవేంద్ర రావు ఉన్నారు. ఆ తరువాత వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత నటుడు కమెడియన్ పృథ్వీ రాజ్ ను జగన్ సర్కార్ భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ నియమించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలం లో పృథ్వీ రాజ్ తన సిబ్బంది మహిళతో రాస లీలల ఫోన్ కాల్ రికార్డు బయట పడింది. దింతో జగన్ సర్కార్ విచారణకు ఆదేశింసి 24 గంటలలో పృథ్వీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా ఎవరు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.

యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్, టీవీ9లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.టీవీ9లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి తర్వాత సాక్షి ఛానెల్‌లో చేరారు. కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకు వచ్చినా సాక్షికి కన్సల్టెంట్‌గా పనిచేయడం విశేషం. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తోన్న స్వప్నను ఈ నేపథ్యంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చెప్పారట. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కావడం, మహిళ కావడంతో ఆమె వైపు మొగ్గు చూపారు జగన్.మరో పక్క జగన్ స్నేహితుడు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి కి ఈ పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి భక్తి ఛానల్ చైర్మన్‌గా జగన్ ఎవరిని నియమిస్తారో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here