జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకో .. ఇంకోసారి మా వాళ్లపై దాడి చేస్తే .. పవన్ వార్నింగ్..!

జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకో .. ఇంకోసారి మా వాళ్లపై దాడి చేస్తే .. పవన్ వార్నింగ్..!

0

కాకినాడ లో వైసీపీ-జనసేన కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో జనసేన కార్యకర్తలకు చాలా మంది గాయపడ్డారు. ఈ ఢిల్లీ పర్యటన లో ఉన్న పవన్ నేరుగా వైజాగ్ నుండి కాకినాడకు వచ్చి వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన పవన్ కళ్యాణ్. దాదాపు 2 గంటల పాటు జనసేన కార్యకర్తల తో గొడవకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం జనసేనాని మీడియా తో మాట్లాడుతూ.

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన తనపై వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి.. ఉపయోగించకూడని భాష ఉపయోగించారన్న జనసేనాని.. మా ఆడపడుచుల మీద, జనసైనికుల మీద దాడి చేయడం క్షమార్హం కాదన్నారు. మీరు తిట్టి.. మా వాళ్ల మీద కేసులు పెడతారా? అని పవన్ ప్రశ్నించారు. తమ వాళ్లను బూతులు తిడుతూ, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూసినట్టు చూడటం బాధాకరమన్న పవన్.. సహనం చేతగాని తనం కాదన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీస్‌శాఖ చూస్తూ కూర్చోవడం దారుణమని అన్నారు. వైసీపీ నేతలు స్థాయి దాటి మాట్లాడుతున్నారని, సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

వైసీపీ పాలన వస్తే.. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని 2014 ఎన్నికల ముందు నుంచి హెచ్చరిస్తున్నానని పవన్ తెలిపారు. ఇలాంటి భాషను, ప్రజాప్రతినిధులను తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేదన్నారు.

తుని సంఘటన జరిగినప్పుడు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించారన్న జనసేనాని.. సుమోటోగా తీసుకొని వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సిందన్నారు. కానీ మా వాళ్లు నిరసన చేపట్టడానికి హక్కులు లేవన్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ లో మదమెక్కిన నేతలు మాట్లాడుతున్నారని, వైసీపీ నేతల మదాన్ని ప్రజలు అణచివేస్తారని పవన్‌ కల్యాణ్‌ తనదైన స్థాయిలో వైసీపీ సర్కార్ పై విరుచుకపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here