కాకినాడకు జనసేనాని.. చుట్టుముట్టిన పోలీసులు..!

కాకినాడ ను చుట్టుముట్టిన పోలీసులు .. కాకినాడకు జనసేనాని..!

0

ఏపీ కి మూడు రాజధానిలపై రచ్చ రోజు రోజు కి ఉదృతం అవుతుంది. అమరావతి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణం లో పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ నుండి పిలిపు రావడం తో హుటాహుటిన పవన్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పవన్ కొంత మంది బీజేపీ నేతలను అయన కలిశారు. అయితే బీజేపీ నేతలతో పవన్ కలవడం తో జనసేన -బీజేపీ కలసి పోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇకపోతే కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తో గత రెండు రోజులుగా వైసీపీ -జనసేన కార్యకర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఇదే తరుణం లో పోలీస్ లు వైసీపీ నాయకుల మీద పెట్టకుండా, జనసేన నాయకులమీద కేసులు పెడుతూన్నారు పవన్ ట్విట్టర్ ద్వారా స్వందించి నేను ఢిల్లీ నుండి నేరుగా కాకినాడ కె వస్తాను అని అన్ని అక్కడే తేల్చుకుందాం అని చెప్పారు.

ఈ రోజు అయన కాకినాడ వస్తూన్న సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ ఉంది ఎటువంటి కార్యక్రమాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా జనసేన కార్యకర్తలు పవన్ పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా నుంచి అందరూ కాకినాడ వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఉండటంతో పోలీసుల్ని భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here