విజయశాంతి లెగ్ కిక్ మామూలుగా లేదుగా..!

విజయశాంతి లెగ్ కిక్ మామూలుగా లేదుగా..!

0

విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలతో అందరితో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఆమె హీరోయిన్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె సినిమాలు మానేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళింది.ఆ తరువాత ఆమె సినిమా ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఇక మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా’సరిలేరు నీకెవ్వరు’ లో ఒక ముఖ్య పాత్రలో 13 ఏళ్ల తర్వాత విజయశాంతి తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

భోగి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియోను డైరెక్టర్ అనిల్ రావిపూడి షేర్ చేశాడు.ఇందులో సినీ నటుడు బ్రహ్మాజీకి విజయశాంతి కిక్ ఇస్తున్నారు. ఇంత గ్యాప్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమెలో ఎనర్జీ, పవర్, ఫైర్ ఏమాత్రం తగ్గలేదని అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ’13 ఏళ్ల తర్వాత అద్భుతంగా పునరాగమనం చేశారు. మాస్టర్ కిక్.’అని ప్రశంసించారు. విజయశాంతికి భోగి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here