ఎంత మంచివాడవురా.. మూవీ రివ్యూ .. ఎన్టీఆర్ కి నిరాశే..!

‘ఎంత మంచివాడవురా ..! ’ మూవీ రివ్యూ

0

నందమూరి కళ్యాణ్ రామ్ దాదాపుగా 20 సినిమాలు నటించారు అందులో చెపొకోదగ్గ హిట్స్ అంటే ‘అతనొక్కడే , పటాస్’ సినిమాలు అని చెప్పవచ్చును వరుస పరాజయాలతో వెనకపడ్డ ఈ నందమూరి హీరో శతమానం భవతి’తో నేషనల్‌ అవార్డు అందుకున్న సతీష్‌ వేగేశ్నతో ‘ఎంత మంచివాడవురా’ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్క్షకుల ముందుకు వచ్చింది.కళ్యాణ్‌రామ్‌కి జోడిగా మెహరీన్‌ జంటగా నటించింది.కళ్యాణ్‌రామ్‌ విషయంలో ఎన్టీఆర్‌ కన్న కల ఎంత మేర విజయం సాధించింది? ‘ఎంత మంచివాడవురా’ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది.. అనేది సినిమా సమీక్షలో చూద్దాం.

కథ:
బాలు(కళ్యాణ్‌ రామ్‌)కు బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బర్త్‌డే కానుకగా చుట్టాలందిరినీ పిలిచి పండగ టైప్‌లో ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని బాలు కోరుతాడు. ఎందుకంటే చుట్టాలంటే తనకు ఇష్టమని పేర్కొంటాడు. అయితే సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు.ఈ సమయంలో నా అనుకున్న బంధువులు బాలు చేతిలో జాలిగా ఏమైనా కొనుకొమ్మని డబ్బులు పెడతారే తప్ప చేయందించి తామున్నామనే భరోసా ఇవ్వరు. ఈ తరుణంలో నందిని (మెహరీన్‌)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. అయితే .. ఎవరు లేని అనాథగా పెరిగిన కళ్యాణ్ రామ్.. ఒక బిజినెస్ ప్లాన్ చేస్తాడు. ఆ బిజినెస్‌లో హీరోయిన్ నందిని కూడా పార్టనర్‌గా చేరుతుంది. ఈ బిజినెస్ వల్ల కళ్యాణ్ రామ్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. అసలు కళ్యాణ్ రామ్ స్టార్ చేసిన ఆ బిజినెస్ ఏమిటి ? చివరకు హీరో, హీరోయిన్ ప్రేమ సక్సెస్ అయిందా ? లేదా అనేదే ఎంత మంచివాడవురా సినిమా స్టోరీ.

నటీనటులు : బాలు పాత్రలో కల్యాణ్ రామ్ యాక్షన్ ..ఎమోషన్స్ ను బాగానే పండించాడు.ఇక మెహ్రీన్ గత చిత్రాల్లో కంటే ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ చేయడంలో పరిణతిని సాధించింది. మనసులో అనుకుంటున్నానని అనుకుని ఆ మాటలను పైకి అనేసే పాత్రలో సీనియర్ నరేశ్ నటన ఆకట్టుకుంటుంది. ఇసుక దందా చేసే గంగరాజు పాత్రలో ప్రతినాయకుడిగా రాజీవ్ కనకాల మెప్పించాడు. నెల రోజుల్లో మరణిస్తానని తెలిసి, 20యేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కోసం ఎదురుచూసే తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి నటన ఉద్వేగానికి గురిచేస్తుంది. శరత్ బాబు .. సుహాసిని .. పవిత్ర లోకేశ్ పాత్రల నిడివి తక్కువే అయినా, తెరకి నిండుదనాన్ని తీసుకొచ్చారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సూపర్బ్ గా ఉంది.

సాంకేతికత విషయానికి వస్తే..

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మున్నార్‌, హీరోహీరోయిన్లను చాలా అందంగా చూపించారు. అయితే మ్యూజిక్‌ చాలా మైనస్‌ అయింది. గోపీ సుందర్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్తగా అనిపించదు. అంతేకాకుండా థియేటర్‌ నుంచి బయటకి వచ్చాక పాటలు కూడా గుర్తుండవు. యాక్షన్‌ సీన్స్‌ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే డైరెక్టర్‌ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే ఎమోషన్స్‌, ఫీల్స్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితే ‘ఎంత మంచి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here